‘కాంతార చాప్టర్ 1’కే ఇలా ఉంటే ‘అఖండ 2’తో థియేటర్లో శవాలు లేస్తాయేమో!

Image 1

ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో డివోషనల్ కంటెంట్‌కు అపారమైన ఆదరణ లభిస్తోంది. కేవలం తెలుగులోనే కాదు పాన్ ఇండియా స్థాయిలో భక్తి, ఆధ్యాత్మికత, మిస్టిక్ అంశాలతో కూడిన సినిమాలు ప్రేక్షకులను థియేటర్లవైపు లాగుతున్నాయి. సౌత్ నుంచి వచ్చిన కార్తికేయ 2, హనుమాన్, కాంతార చిత్రాలు నార్త్‌లోనూ భారీ విజయాలు అందుకోగా.. ఇటీవల వచ్చిన ‘ కాంతార చాప్టర్ 1 ’ అంతకుమించి బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. వారం రోజులు ముగిసేనాటికే ఈ చిత్రం రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ‘కాంతార’ క్లైమాక్స్‌లో రిషభ్‌శెట్టి నటనకు ప్రేక్షకులు మెస్మరైజ్ అయిపోయారు. ఇప్పుడు దానికి ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ‘కాంతార చాప్టర్ 1’లోనూ గూస్‌బంప్స్ తెచ్చే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. థియేటర్లలో సినిమా చూస్తున్న సమయంలో ప్రేక్షకులు భావోద్వేగానికి గురై పూనకాలతో ఊగిపోతున్నారు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ చిత్రం గురించి మాట్లాడుకుంటున్నారు.

ఇప్పుడు ఈ వేవ్‌ని ఫాలో అవుతూ మరో భారీ డివోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ సిద్ధమవుతోంది అదే ‘ అఖండ 2 ’ (అఖండ – తాండవం). బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌ అంటేనే అభిమానుల్లో వేరే స్థాయి ఎక్సైట్మెంట్ ఉంటుంది. 2021లో వచ్చిన ‘అఖండ’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించడమే కాకుండా ఆధ్యాత్మిక యాక్షన్ సినిమాలకు కొత్త దిశ దశ చూపింది. అదే ఎమోషన్‌ను మరో లెవెల్‌లో చూపించడానికి ఈ సీక్వెల్ రూపొందుతోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ‘అఖండ 2’ అవుట్‌పుట్ ఇప్పటివరకు బాలకృష్ణ కెరీర్‌లోనే విజువల్ గ్రాండెస్ట్ ప్రాజెక్ట్‌గా నిలవబోతోందట. సీజీ వర్క్‌లు, యాక్షన్ సీక్వెన్స్‌లు, దేవాలయ నేపథ్యం అన్నీ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారని సమాచారం. సినిమా రిలీజ్ డిసెంబర్ 5కు ఫిక్స్ కాగా టీమ్ ప్రస్తుతం చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చింది. టీజరే ఆ రేంజులో ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నామంటూ మేకర్స్ మరింత హైప్ పెంచేస్తున్నారు. బాలకృష్ణ కెరీర్లోనే తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో ఆయన ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘కాంతార చాప్టర్ 1’ చూసి ఆధ్యాత్మిక అనుభూతిలో మునిగితేలుతున్న ప్రేక్షకులు ‘అఖండ 2’ కోసం ఊపిరి బిగబట్టే స్థితిలో ఉన్నారు. “కాంతార చూసి మెస్మరైజ్ అవుతోన్న ప్రేక్షకులకి ‘అఖండ 2’ చూస్తే పూనకాలు వచ్చేస్తాయి!”, “ఇది కేవలం సినిమా కాదు, ఆధ్యాత్మిక అనుభవం”, “థియేటర్లలో శవాలు లేస్తాయి” అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ శివతత్వంతో మేళవించిన డైలాగులు, బోయపాటి మాస్ యాక్షన్ ప్రెజెంటేషన్.. ఈ రెండింటి కలయికే అభిమానుల్లో పూనకాన్ని రేపుతోంది. ‘కాంతార చాప్టర్ 1’ తో కొనసాగుతోన్న ఆధ్యాత్మిక తరంగం ‘అఖండ 2’ తో పీక్స్‌కు చేరనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. డిసెంబర్ 5 నుంచి థియేటర్లలో పూనకాలు, అర్చనలు, శివభక్తి చింతనతో నిండిపోవడం ఖాయమని అంటున్నారు

Related News