హనీమూన్‌ కూడా ప్లాన్ చెయ్యండి.. పెళ్లి వార్తలపై త్రిష రియాక్షన్ ఇదే..

Image 1

సౌత్ స్టార్ హీరోయిన్లలో త్రిష కృష్ణన్ ఒకరు. గత రెండు దశబ్దాలుగా సినీ అభిమానులను అలరిస్తున్నారు. నాలుగు పదుల వయసు దాటినా ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు. అందుకే త్రిష పెళ్లి ఎప్పుడూ హాట్ టాపిక్ గా నడుస్తూ ఉంటుంది. ఇప్పటికే అనేకసార్లు ఆమె వివాహం గురించి రూమర్స్ వచ్చాయి. ఫలానా వ్యక్తితో డేటింగ్ చేస్తుందని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఇటీవల మరోసారి ఆమె పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై త్రిష తాజాగా స్పందించారు. ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ పెట్టారు.

చండీగఢ్‌కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ తో త్రిష మ్యారేజ్ జరగనుందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. నేషనల్ మీడియాలోనూ ఈ న్యూస్ హెడ్ లైన్స్ లో వచ్చింది. దీనిపై త్రిష స్పందిస్తూ.. “నాకోసం నా జీవితాన్ని ప్లాన్‌ చేస్తున్న జనాలను నేను ప్రేమిస్తాను. హనీమూన్‌ షెడ్యూల్‌ కూడా చెబుతారేమోనని వేచి చూస్తున్నా” అంటూ సెటైరికల్ పోస్ట్ పెట్టారు. పెళ్లి చేసుకోనుందనే వార్తలను పరోక్షంగా ఖండిస్తూ, కాస్త వెటకారంగా రాసుకొచ్చింది.

నిజానికి 2015లోనే వరుణ్‌ మణియన్‌ అనే వ్యాపారవేత్తతో త్రిషకి నిశ్చితార్థం జరిగింది. అయితే అది పెళ్లి వరకూ వెళ్లలేదు. కొన్ని కారణాల వల్ల ఇరువురు ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ కెరీర్‌పై దృష్టి పెట్టిన త్రిష వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఈ దశాబ్ద కాలంలో ఆమె పెళ్లిపై, రిలేషన్ షిప్స్ పై లెక్కలేనన్ని వార్తలు వచ్చాయి. ఎప్పటికప్పుడు వాటిని ఖండిస్తూనే ఉంది. 42 ఏళ్ల వయసులో ఇప్పుడు మరోసారి మ్యారేజ్ రూమర్స్ వచ్చాయి. మరి త్వరలోనే వాటిని నిజం చేసి అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతుందేమో చూడాలి.1999లో 'జోడి' సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన త్రిష కృష్ణన్.. 2002లో 'మౌనం పెసియాదే' అనే తమిళ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. 'నీ మనసు నాకు తెలుసు' మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. తెలుగు, తమిళంతో పాటుగా మలయాళం, హిందీ చిత్రాల్లోనూ నటించింది. ఇప్పటికీ మెయిన్ హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడం విశేషం. ఈ ఏడాదిలో 'ఐడెంటిటీ', 'విదాయుమురిచ్చి', 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ', 'థగ్‌ లైఫ్‌' వంటి చిత్రాల్లో త్రిష నటించింది. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవితో కలిసి 'విశ్వంభర' సినిమా చేస్తోంది. అలానే సూర్యకు జోడీగా 'కరుప్పు' చిత్రం చేస్తోంది.

Related News