'అవతార్ 3' ట్రైలర్.. మరో సరికొత్త ఫాంటసీ వరల్డ్‌లోకి తీసుకెళ్లిన జేమ్స్‌ కామెరూన్

Image 1

హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ క్రియేట్ చేసిన వెండి తెర విజువల్ వండర్ 'అవతార్'. 2009లో వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్.. ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టించింది. వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసింది. దానికి కొనసాగింపుగా 13 ఏళ్ళ తర్వాత 2022లో వచ్చిన 'అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్' సినిమా కూడా సంచలన విజయం సాధించింది. ఇప్పుడు అవతార్ ఫ్రాంచైజీలో మూడో సినిమా వస్తోంది. 'అవతార్: ఫైర్‌ అండ్‌ యాష్‌' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం.. డిసెంబరు 19న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా 'అవతార్ 3' ట్రైలర్‌ను విడుదల చేశారు. మరికొన్ని సరికొత్త పాత్రలతో మరో కొత్త ఊహా లోకంలోకి తీసుకెళ్లిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

Related News