'మిడిల్ క్లాస్ వాళ్లు ఇద్దర్ని ఎందుకు కంటారో తెలుశా'.. ఈ డైలాగ్ తప్ప మిగతాది సూపర్.. లిటిల్ హార్ట్స్ టీజర్

Image 1

"మరి ఎందుకురా నీకు.." అనే ఒకే ఒక్క డైలాగ్‌తో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాడు మౌలి. అలానే 90s మిడిల్ క్లాస్ బయోపిక్‌ ద్వారా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాడు అలానే కన్నీళ్లు పెట్టుకునేలా చేశాడు. ఇక మౌలి టాక్స్ పేరుతో ఈ కుర్రాడు చేసిన యూట్యూబ్ వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆడియన్స్‌ని మరోసారి ఎంటర్‌టైన్ చేసేందుకు మౌలి రెడీ అయ్యాడు. లిటిల్ హార్ట్స్ అంటూ మౌలి ప్రధాన పాత్రలో చేసిన సినిమా టీజర్ లేటెస్ట్‌గా రిలీజైంది.

ఇందులో మౌలికి జంటగా శివానీ నాగారం నటించింది. సాయి మార్తాండ్‌ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని ఈటీవీ విన్‌ ఒరిజినల్‌ ప్రొడక్షన్‌ నిర్మించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. తాజాగా వదిలిన టీజర్ అయితే ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించేలా ఉంది. ముఖ్యంగా మౌలి మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. కాలేజ్ లైఫ్, కుర్రాళ్ల తుంటరి పనులు, అమ్మాయిల వెనక తిరగడం, ఎమ్‌సెట్ ప్రిపరేషన్.. ఇలా ప్రతిదీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.

ముఖ్యంగా శివాని- మౌలి మధ్య లవ్ ట్రాక్ ఆకట్టుకుంది. అమ్మాయి వెనకాల తిరిగి లవ్యూ అంటే ఓకే థాంక్స్ అంటూ హీరోయిన్ చెప్పడం టీజర్‌లో హైలెట్‌గా ఉంది. అయితే టీజర్ చివరిలో ఉన్న ఒక డైలాగ్‌పై మాత్రం ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇద్దర్ని ఎందుకు కంటారో తెలుసా.. ఈ సొసైటీ పెట్టే ప్రెజర్‌కి ఒకడు పోయినా ఇంకొకడు ఉంటాడని అంటూ మౌలి చెప్పిన డైలాగ్ కాంట్రవర్శి అయ్యేలా ఉంది. ఇక ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్‌కి డైరెక్టర్ అనిల్ రావిపూడి గెస్టుగా వచ్చారు.

Related News