నాట్స్ అధ్యక్షుడిగా శ్రీహరి మందాడి.. న్యూజెర్సీలో ఘనంగా ప్రమాణ స్వీకారం

Image 1

ఎడిసన్: న్యూ జెర్సీ: జూన్1: అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్‌కు నూతన అధ్యక్షుడిగా శ్రీహరి మందాడి పదవీ బాధ్యతలు స్వీకరించారు. న్యూజెర్సీలో నాట్స్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, శ్రీహరి మందాడిచే నాట్స్ అధ్యక్ష ప్రమాణ స్వీకారం చేయించారు. నాట్స్‌లో ఓ సాధారణ సభ్యుడి నుంచి నాట్స్ అధ్యక్ష స్థానం వరకు చేరుకున్న శ్రీహరి మందాడిపై నాట్స్ నాయకత్వం ప్రశంసల వర్షం కురిపించింది.

Image 3

నాట్స్‌లో కష్టపడే ప్రతి ఒక్కరికి నాట్స్ కచ్చితంగా అవకాశం కల్పిస్తుందని ప్రశాంత్ పిన్నమనేని తెలిపారు. ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన శ్రీహరి మందాడి.. ఈ రోజు వ్యాపారంలో.. సేవ రంగంలో దూసుకుపోవడం నిజంగా అభినందించదగ్గ విషయమని అన్నారు. న్యూజెర్సీలో ఏ చిన్న కార్యక్రమంలోనైనా తన సేవలు కూడా ఉండాలని తపించే వ్యక్తి శ్రీహరి అని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీస్ సర్వీస్ చైర్మన్, నాట్స్ బోర్డ్ డైరెక్టర్, నాట్స్ మాజీ అధ్యక్షుడు, మోహన కృష్ణ మన్నవ అన్నారు. నాట్స్ అధ్యక్షుడిగా కూడా శ్రీహరి కొత్త విజయాలు సాధిస్తారనే నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు.

Image 5

నాట్స్ నాయకులు, నాట్స్ సభ్యులతో పాటు దాదాపు 700 మందికి పైగా తెలుగు వారు ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. జూలై 4,5,6 తేదీల్లో టంపా, ఫ్లోరిడా లో జరిగే తెలుగు సంబరాలకు తరలిరావాలని పలువురు నాట్స్ నాయకులు పిలుపునిచ్చారు. అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి జరిగే ఈ తెలుగు సంబరాల్లో బాలకృష్ణ, వెంకటేశ్, అల్లు అర్జున్ లాంటి స్టార్లు తరలివస్తున్నారని తెలిపారు. థమన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ షోలు ఈ సంబరాల్లో ఆన్‌లిమెటెడ్‌ ఆనందాన్ని ఇస్తాయన్నారు.

Image 7

మరోవైపు.. 8వ అమెరికా అమెరికా తెలుగు సంబరాల కోసం ఇదే వేదికపై చేపట్టిన ఫండ్ రైజింగ్‌కు మంచి స్పందన లభించింది. 3.5 లక్షల నుండి 4లక్షల డాలర్ల ఇచ్చేందుకు దాతలు ముందుకు రావడం విశేషం. నాట్స్ సేవ కార్యక్రమాలు, నాట్స్ సంబరాల ప్రత్యేకతలు ఈ సారి సంబరాల ఫండ్ రైజింగ్‌కు మంచి స్పందన లభించిందని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి తెలిపారు. నాట్స్ నాయకులు, పలు జాతీయ, అంతర్జాతీయ, స్థానిక సంస్థల నాయకులు కూడా సంబరాలకు విరాళాలు ఇచ్చేందుకు ముందుకొచ్చి హామీ ఇచ్చారని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మండాడి తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణలో కిరణ్ మందాడితో పాటు న్యూ జెర్సీ నాట్స్ చాప్టర్ నాయకులు కీలక పాత్ర పోషించారు.

Image 9

తెలుగుదనాన్ని చూపెట్టిన తెలుగు అమ్మాయి పోటీలు
న్యూజెర్సీలో నాట్స్ నిర్వహించిన తెలుగమ్మాయి పోటీల్లో తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ తెలుగు అమ్మాయిలు ఈ పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వయస్సుల వారీగా వివిధ విభాగాల్లో జరిగిన ఈ పోటీలు అందరిని ఆకట్టుకున్నాయి. తెలుగు మాట, తెలుగు ఆట, తెలుగు పాట, తెలుగు సంస్కృతి ఇలా వివిధ అంశాలపై ఈ పోటీలో పాల్గొన్న వారిని పోటీలు నిర్వహించి తుది విజేతలను నాట్స్ ప్రకటించింది.

Image 11

నాట్స్ తెలుగమ్మాయి పోటీల్లో పాల్గొన్న వారు, విజేతలుగా నిలిచిన వారి వివరాలు ఇవే..

Image 13

టీన్ నాట్స్

Image 15

• సమికా సుబ్బా రావు
• ప్రియాంక మల్లుభట్ల
• దియా కిరణ్
• శ్రీవల్లి కొండూరు
• దిశిత గుండ్లూరి

మిస్ నాట్స్

• నిహారిక బవిరిశెట్టి
• మనస్విని ఇప్పిలి

మిసెస్ నాట్స్

• చైతన్య మద్దూరి
• వాహిని కాళిదాస్
• శ్రీలక్ష్మి కుంకు

విజేతలు వీరే

• సమిక – టీన్ నాట్స్
• నిహారిక – మిస్ నాట్స్
• వాహిని – మిసెస్ నాట్స్

Related News