న్యూజెర్సీలో ఆటా దసరా సంబరాలు, జమ్మిపూజలో పాల్గొన్న ప్రవాసులు

Image 1

తెలుగు వైభవాన్ని ఖండాంతరాలకు చాటుతూ అమెరికా తెలుగు సంఘం (ATA) ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని దసరా సంబరాలు అత్యద్భుతంగా జరిగాయి. రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ వేదికగా అక్టోబర్ 5న జరిగిన ఈ మహా సంబురం.. న్యూజెర్సీని పూర్తిగా పండుగ వాతావరణంలో ముంచెత్తింది. వేలాది తెలుగు కుటుంబాలు సంప్రదాయ దుస్తుల్లో హాజరై, భక్తి శ్రద్ధలతో దుర్గాదేవి పూజ, జమ్మి పూజలలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు జనాల్లో కొత్త ఉత్సాహాన్ని, సరికొత్త జోష్‌ని నింపాయి.సాయిదత్త పీఠాధిపతి రఘుశర్మ గారు దుర్గామాత పూజలు నిర్వహించగా, తదనంతరం పల్లకి సేవ కూడా శాస్త్ర యుక్తంగా నిర్వహించారు.

Image 3

ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రముఖ కళాకారుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 'బలగం' సినిమాకు ఉత్తమ గేయ రచయితగా జాతీయ అవార్డు అందుకున్న కాసర్ల శ్యామ్ తన పాటలతో వేదికను ఉర్రూతలూగించారు. అలాగే, దండేపల్లి శ్రీను, మధు బొమ్మిని వంటి ప్రముఖ ఫోక్ సింగర్లు తమ 'ధూమ్ ధామ్' పాటలతో ప్రేక్షకులను మైమరిపించారు. వారి పాటలకు అనుగుణంగా ప్రవాసీయులు ఉత్సాహంగా చిందులు వేశారు.భారత కాన్సులేట్ (న్యూయార్క్) నుండి మహేష్ యాదవ్ కూడా పాల్గొని అందరికి దసరా శుభాకాంక్షలు తెలిపారు.

Image 5

పోటీలు.. ప్రదర్శనలతో ఉల్లాసం

Image 7

ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో 200 మంది పిల్లలు పాల్గొని తమ ఆటపాటలతో ఆకట్టుకున్నారు. అంతేకాకుండా.. ఈ పిల్లలంతా దైవత్వం ఉట్టిపడేలా, రాముడు, సీత, కృష్ణ, రాధ ఇలా దైవ స్వరూపాల వేషధారణల్లో కనిపించటం ప్రత్యేక ఆకర్షణగా నిలించింది. ఈ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు యువతను ఆకర్షించేలా నిర్వహించిన పోటీలు ఉల్లాసభరితంగా సాగాయి. దసరా స్ఫూర్తిని నింపే నృత్య ప్రదర్శనలు ఆకట్టుకోగా,.. రకరకాల అలంకరణలతో కూడిన కాస్ట్యూమ్ కాంపిటీషన్, 'వావ్' అనిపించే ఫ్యాషన్ వాక్ ప్రదర్శనలు ప్రత్యేకంగా నిలిచాయి. రజిత ఆకుల ఆధ్వర్యంలో జరిగిన బొమ్మల కొలువు అందరిని విశేషంగా ఆకట్టుకుంది .చివర్లో నిర్వహించిన రాఫిల్ టికెట్స్ ద్వారా విజేతలకు బహుమతులు అందజేశారు.

Image 9

ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా మరియు ఆటా ఎలెక్ట్ అధ్యక్షుడు సతీష్ రెడ్డి మాట్లాడుతూ దసరా ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ప్రదీప్ రెడ్డి కట్టా, కృష్ణ మోహన్ మూలే, ప్రసాద్ ఆకుల, సంతోష్ రెడ్డి కోరం, శ్రీకాంత్ రెడ్డి తుమ్మల, విలాస్ జంబులకు సభాముఖంగా అభినందనలు తెలిపారు.

Image 11

ATA సభ్యులు శరత్ రెడ్డి వేముల,రాజేందర్ జిన్నా,పరమేశ్ భీంరెడ్డి ,పరుషురాం పిన్నపురెడ్డి వినోద్ కోడురు గారు, విజయ్ కుందూరు,శ్రీకాంత్ గుడిపాటి మాట్లాడుతూ .. భారతదేశ సంస్కృతిని విదేశీ గడ్డపై ప్రదర్శించడం , కార్యాక్రమంలో తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషకరం అని తెలిపారు.
ఈ కార్యక్రమానికి సౌత్ జెర్సీ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ శైల మండల తో పాటు తానా , టిటిఏ, మాటా, నాట్స్, ఇండో అమెరికన్ కమ్యూనిటీ అలయన్స్, కళాభారతి, తెలుగు కళాసమితి, టీడీఎఫ్ సభ్యులు కూడా పాల్గొన్నారు.

Image 13
Image 15

Related News