OG ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియో.. ఓజాస్ గంభీర వచ్చేశాడు!

Image 1

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓజీ’ (OG). సుజీత్‌ దర్శకత్వంలో ఈ గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ డ్రామా తెరకెక్కుతోంది. ఇందులో ప్రియాంకా మోహన్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దసరా స్పెషల్ గా థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్న ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. తాజాగా చిత్ర బృందం ఫస్ట్ సింగిల్ ని లాంచ్ చేశారు.

ఓజీ నుంచి 'ఫైర్ స్టార్మ్' అంటూ సాగే ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియోని శనివారం సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఎస్.థమన్ కంపోజ్ చేసిన ఈ పాట ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సినిమాలో పవన్ కళ్యాణ్ పోషిస్తున్న ఓజాస్ గంభీర పాత్రను ఎలివేట్ చేసేలా ఈ పాటని రూపొందించారు. హీరో శింబు పాడిన ఈ సాంగ్ లో తెలుగు, ఇంగ్లిష్, జపనీస్ కలబోసిన లిరిక్స్ వినిపించడం గమనార్హం.

Related News