
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన అందం, అభినయం, క్యూట్‌నెస్‌తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి రష్మిక మందన్నా ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యంత బిజీ హీరోయిన్‌గా కొనసాగుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ జాతీయ స్థాయిలో స్టార్‌డమ్ అందుకున్న రష్మికకు ప్రస్తుతం ఉన్న క్రేజ్ మరెవరికి లేదని చెప్పాలి. ఆమె ‘నేషనల్ క్రష్’ ట్యాగ్‌ను కూడా బలంగా నిలబెట్టుకుంది. మరోవైపు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ఆమె రిలేషన్‌షిప్ రూమర్స్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. ఇద్దరూ కలిసి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలతో అద్భుతమైన కెమిస్ట్రీ చూపించడంతో ఫ్యాన్స్ ఈ జంటను రియల్ లైఫ్‌లో కూడా చూడాలని కోరుకుంటున్నారు. ఇటీవల వీరిద్దరూ ఎంగేజ్ అయ్యారనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ సృష్టించగా ఇద్దరూ ఈ విషయంపై మౌనం పాటించడం ఆ ఊహాగానాలకు మరింత బలం ఇచ్చింది.
ఇక రష్మిక కెరీర్ విషయానికి వస్తే ఈ ఏడాది మొత్తం ఆమె పేరే ఇండియన్ సినిమా చర్చల్లో నిలిచింది. నెల, రెండు నెలల వ్యవధిలో వరుస సినిమాలు రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. గత ఏడాది చివర్లో వచ్చిన పుష్ప 2తో పాన్‌ఇండియా లెవల్‌లో తన స్థాయిని నిరూపించుకున్న రష్మిక... ఈ ఏడాది ఛావా, సికందర్, కుబేర, థామా సినిమాలతో మంచి విజయాలు అందుకుంది. ఈ విజయాల సిరీస్‌లో ఇప్పుడు రష్మిక నటించిన తాజా చిత్రం ‘ ది గర్ల్‌ఫ్రెండ్ ’ కూడా చేరబోతోంది. ఈ సినిమా నవంబర్ 7న విడుదల కానుండగా, రష్మిక ప్రస్తుతం దాని ప్రమోషన్లలో బిజీగా ఉంది. షోలు, ఇంటర్వ్యూలలో పాల్గొంటూ అభిమానులను అలరిస్తోంది.
ఈ క్రమంలోనే జగపతిబాబు హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షోలో పాల్గొని చమత్కారాలతో షోని రచ్చ చేసింది. తన చిన్ననాటి స్కూల్ రోజుల జ్ఞాపకాలు, సరదా సంఘటనలు పంచుకుంటూ నవ్వులు పూయించింది. అలాగే జగపతిబాబు అడిగిన ప్రశ్నలకు రష్మిక ఇచ్చిన క్యూట్ సమాధానాలు ప్రేక్షకులను మెప్పించాయి. ముఖ్యంగా ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అయింది. “మగాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే బాగుండని అనిపించింది. ఆ నొప్పి, అసౌకర్యం, మూడ్ స్వింగ్స్ అన్నీ అనుభవిస్తేనే మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటారు” అని రష్మిక చెప్పడంతో అక్కడున్న ఆడియెన్స్ చప్పట్లు కొట్టారు. జగపతిబాబు కూడా ఆమె మాటలకు అభినందనలు తెలిపారు. ఈ వ్యాఖ్యతో రష్మిక మరోసారి మహిళల వాయిస్ వినిపించిందని అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు.
ఇక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ విషయానికి వస్తే ఇదొక ఇంటెన్స్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. దీక్షిత్ శెట్టి హీరోగా నటించగా, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇది ప్రేమలోని కొత్త కోణాన్ని చూపించే ప్రయత్నమని, సినిమా చూసిన తర్వాత అమ్మాయిలు తమ లవర్స్ గురించి కొత్తగా ఆలోచించేలా ఉంటుందని డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ చెబుతున్నారు. రష్మిక ప్రస్తుత ప్రాజెక్ట్‌లలో ‘మైసా’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా, ఒక కొత్త బాలీవుడ్ ప్రాజెక్ట్, అలాగే విజయ్ దేవరకొండతో కలిసి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ఉన్నాయి.