జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది అంటారు సినీ కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఇప్పుడు యువత పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అత్యాధునిక టెక్నాలజీ, సదుపాయాలతో ప్రపంచం కుగ్రామంగా మారిపోతే.. యువత మాత్రం ఒంటరితనం ఫీలవుతోంది. లోన్లీనెస్ ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. యువతలో ఒంటరితనం ఎక్కువైందని, మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇటీవల పరిశోధనలు తెలియజేస్తున్నాయి. రాబోయే తరాలకు ఈ మార్పు పెను ముప్పుగా పరిణమిస్తుందని చెబుతున్నాయి. యువతపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని.. లేకపోతే వారి భవిష్యత్తుకే పెను ప్రమాదం పొంచి ఉందని వార్నింగ్ ఇస్తున్నారు! యువతలో ఒంటరితనం పెరగడానికి కారణాలేంటి? లోన్లీనెస్ పోగొట్టాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
ఒంటరితనం.. ఏ వయసువారినైనా ముంచెత్తుతుంది. ఆలోచనల అగాథంలోకి తీసుకెళ్లి వదిలేస్తుంది. లోలోపలే మదనపడేలా చేస్తుంది. ఉద్వేగాన్ని రెచ్చగొట్టి కుంగిపోయేలా చేస్తుంది. ప్రపంచంలోని ప్రతి ఆరుగురిలో ఒకరు ఒంటరితనం వల్ల ప్రభావితం అవుతున్నారట. ఇక ఈ లెక్కన.. 13 నుంచి 17 ఏళ్ల యవతలో అత్యధికంగా (20.9 శాతం) ఉందట ఒంటరితనం. ముఖ్యంగా తక్కువ-మధ్య ఆదాయ దేశాల్లో యువత జీవితాలను ఒంటరితనం చిదిమేస్తోందట.
హై-ఇన్‌కం దేశాల (11 శాతం) కంటే తక్కువ ఆదాయ దేశాల్లో 24 శాతం ప్రజలు ఒంటరితనంతో బాధపడుతున్నారట. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization - WHO) కు చెందిన సోషల్ కనెక్షన్ కమిషన్ (WHO Commission on Social Connection) ఓ నివేదిక వెలువరించింది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. ఇలా ఒంటరితనంగా ఫీల్ అవుతున్న యువత.. స్కూల్, కాలేజీల్లో తక్కువ గ్రేడ్లు సాధించే ప్రమాదం 22 శాతం ఎక్కువగా ఉందట. ఈ పరిస్థితిని సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్స్.. మరింత దిగజార్చుతున్నాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఒంటరితనం ఎందుకంత ప్రమాదకరం?
డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో ప్రతి గంటకు సంభవిస్తున్న దాదాపు 100 మరణాలకు.. ఒంటరితనం ఒక కారణంగా ఉందట. ఏడాదికి 8,71,000 మంది చావులకు లోన్లీనెస్ ఒక కారణంగా పరిశోధనల రిపోర్టులు చెబుతున్నాయి. పలు కారణాల వల్ల ఈ ఒంటరితనం ఎక్కువైపోతుందని నిపుణులు చెబుతున్నారు.
డిజిటల్‌గా ప్రపంచ నలుమూలల నుంచి ఒకరితో ఒకరు కనెక్ట్ అయిన ఈ ప్రపంచంలో కూడా.. చాలా మంది యువకులు ఒంటరిగా ఉన్నట్లు భావిస్తారు. సాంకేతికత మన జీవితాలను పునర్నిర్మిస్తోంది. అయితే అది మానవ సంబంధాలను బలోపేతం చేసేలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, బలహీనపరచకూడదు. డిజిటల్ యాక్సెస్, ఆరోగ్యం వరకు, విద్య, ఉపాధి.. అన్ని విధాన పరమైన నిర్ణయాల్లో సోషల్ కనెక్షన్‌ను (social connection) భాగం చేయాలని మా నివేదిక సూచిస్తోంది.
ఒంటరితనానికి సాధారణ కారణాలు..
-దీర్ఘకాలిక వ్యాధులు లేదా వైకల్యాలు.. సోషల్ యాక్టివిటీల్లో పాల్గొనే సామర్థ్యాన్ని పరిమితం చేస్తాయి. దీంతో సోషల్ ఇంటరాక్షన్ ఉండదు. ఫలితంగా ఒంటరితనం పెరుగుతుంది.
-ఇక అనారోగ్యం వల్ల కలిగే బాధ కూడా.. లోన్లీనెస్ ఫీలింగ్‌ను కల్పిస్తాయి.
-ఒంటరిగా నివసించే వ్యక్తులు సామాజిక ఒంటరితనాన్ని అనుభవించే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
-ఇక ఇంట్లో కుటుంబ సభ్యులతో తక్కువ ఇంటరాక్షన్ ఉంటడం కూడా ఒంటరితనానికి దారితీస్తుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి.
-సోషల్ ఇంటరాక్షన్‌న ప్రోత్సహించే పబ్లిక్ స్పేస్‌లు, రవాణా సౌకర్యం, కమ్యూనిటీ కేంద్రాలు సరిగా ఉండకపోవడం కూడా ఒంతరితనం పెరగడానికి కారణం అవుతుందట. ఈ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు విధానాలు రూపొందించకపోవడం కూడా.. పరిస్థితి తీవ్రతను పెంచుతోందట.
-అంతేకాకుండా ఇప్పుడున్న సంబంధాల నాణ్యతపై యువత అసంతృప్తిగా ఉన్నారు. వారుకోరుకున్నట్లు ఆ రిలేషన్‌షిప్‌లు ఉండటం లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోందట.
సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్ ప్రభావం..
యువతలో లోన్లీనెస్ పోగొట్టాలంటే ఏం చేయాలి?
ఇంటరాక్షన్ పెంచాలి:
ఒంటరితనాన్ని దూరం చేయాలంటే.. యువతలో సామాజిక ఇంటరాక్షన్ పెరిగేలా చర్యలు తీసుకోవాలి. క్లబ్స్, క్రీడలు, వలంటీర్‌గా ఏవైనా పనులు చేసేలా ప్రోత్సహించాలి. అప్పుడే వారు ఇతరులతో మాట్లాడతారు. పరిచయాలు, రిలేషన్‌షిప్‌లు ఏర్పడతాయి. అంతేకాకుండా ఎమోషన్, సోషల్ స్కిల్స్‌పై యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
సోషల్ మీడియా వాడకం తగ్గించాలి:
పిల్లలు, యూత్.. సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్ వంటి పరికరాలను పాజిటివ్‌గా ఉపయోగించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్క్రీ్న్ టైమ్ తక్కువగా ఉండేటట్టు చూడాలి. ఇక సోషల్ మీడియాలో కూడా పాజిటివ్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకునేలా పర్యవేక్షించాలి తల్లిదండ్రులు. సైబర్ బుల్లీయింగ్‌కు బాధితులు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
శారీరక, మానసిక ఆరోగ్యం:
పిల్లలు, యువతలో.. శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందించడానికి.. వ్యాయామం, యోగా, డ్యాన్స్, వాకింగ్ క్లబ్‌ల్లో పాల్గొనేలా చేయాలి. భావోద్వేగాలు నియంత్రించుకునేలా మెడిటేషన్ వంటివి చేయమని చెప్పాలి.
కమ్యూనిటీ, పబ్లిక్ పాలసీ..
సురక్షితమైన పబ్లిక్ ప్లేస్‌లను (పార్కులు, లైబ్రరీలు, కేఫ్‌లు.. ) అభివృద్ధి చేయాలి. అలాంటి చోట్లకు వెళ్లేందుకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలి. ఇక ఒంటరితనాన్ని పోగొట్టేందుకు ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలి. యువత ఆర్థిక స్థిరత్వం సాధించేలా విద్య అందించాలి.
పిల్లలు కుంగుబాటుతో బాధ పడుతున్నట్లు ఇలా గుర్తించాలి!
తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక సమయంలో ఒంటరితనం ఆవహిస్తుంది! అయితే అది కొంత కాలమే. ఎందుకంటే.. మనిషి ఒక సోషల్ యానిమల్ అని అంటారు. అంటే మానవులు సహజంగానే సామాజిక సమూహాల్లా జీవిస్తారు. అంతేకాకుండా సంక్షేమం కోసం, అభివృద్ధి చెందడానికి ఇతరులతో ఇంటరాక్ట్ అవుతారు. దీనికి విరుద్ధంగా ఒంటరిగా ఉంటే మనిషి కుంగుబాటుకు గురవుతాడు. అది అనేక అనర్థాలకు దారితీస్తుంది. ఈ భూమి పైకి ఒంటరిగా వచ్చాం.. ఒంటరిగానే పోతాం.. మధ్యలో ఈ కాస్త సమయమైనా అందరితో కలిసి మెలగకపోతే ఎలా..!