అమెరికాలోని న్యూజెర్సీలో ‘సాయిదత్త పీఠం’ ఆధ్వర్యంలో శ్రీ శివ విష్ణు దేవాలయంలో అయ్యప్ప పడిపూజ ఘనంగా జరిగింది. హరి హర సుతుడు అయ్యప్ప శరణు ఘోషలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. గురుస్వాములు రఘు శర్మ శంకరమంచి, అశోక్ వల్లెపు, సుమన్ నిమ్మల మరియు విలాస్ రెడ్డి జంబుల, వెంకట్ రెడ్డి మూలం, భరత్ శ్యామ్, శ్రీకాంత్ భోగరాజు, రాజేష్ రెడ్డి గుదిబండి స్వాముల ఆధ్వర్యంలో పడిపూజ జరిగింది. మాలలతో అలంకరించిన విజ్ఞేశ్వర, సుబ్రమణ్య స్వాములతో పువ్వులు దీపాలు మరియు పండ్లతో అలంకరించిన పద్దెనిమిది పడి మెట్లపై స్వామి సేద తీరాడు. అయ్యప్ప సాయి భజనలతో భక్తులు తన్మయత్వం చెందారు. స్వామివారికి పుష్పాభిషేకం, పంచామృతం, చందనం మరియు విభూదితో అభిషేకం చేశారు. స్వామివారికి ప్రియమైన పొంగలి నైవేద్యం సమర్పించారు. అనంతరం పద్దెనిమిది మెట్లపై పిల్లల చేత కర్పూర దీపం వెలిగించారు.
చాల కాలం తర్వాత పడిపూజ లో పాల్గొనడం ఆనందంగా ఉందని అయ్యప్ప మాల వేయని ఇతర భక్తులు తెలిపారు. ఆలయంలో నిత్య పూజలతో పాటు భజనలు, సంస్కృతిక కార్యక్రమాలు కూడా వైభవంగా చేస్తారు. వీటితో భారత సంప్రదాయం ప్రకారం.. పండుగలను నిర్వహిస్తూ అయ్యప్ప మాలాధారణ చేపడుతారు.
కార్తీక మాసం వచ్చిందంటే చాలు భక్తులు అయ్యప్ప స్వామి సేవలో తరిస్తారు. 41 రోజుల మండల దీక్షతో పాటు వారికి అనుకూలైన 21 రోజులు లేదా 11 రోజులు లేదంటే వారి మొక్కుకు అనుసరించి మాలధారణ చేస్తారు. కఠిన నియమాలు పాటిస్తూ స్వామి వారిని కొలుస్తూ ఉంటారు . మొక్కు చెల్లించుకునేందుకు ఇరుముడిని ధరించి స్వామి వారికి సమర్పించి మాలను విరమిస్తారు.
శ్రీదత్త పీఠం ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ శివ విష్ణు దేవాలయంలో అయ్యప్ప స్వామి మహా పడి పూజ డిసెంబర్ 22న మరియు అయ్యప్ప ఇరుముడి పూజలు డిసెంబర్ 25న జరగబోతున్నాయి.
ఈ కార్యక్రమములో రఘు శర్మ శంకరమంచి, విలాస్ రెడ్డి జంబుల, అశోక్ , సుమన్ ,ఉపేంద్ర చివుకుల , వెంకట్ రెడ్డి , భరత్ , శ్రీకాంత్ , రాజేష్ , కృష్ణ రెడ్డి ఏనుగుల , సుధాకర్ ఉప్పల, దాము గేదెల, అమర్ జున్నుతుల, ప్రుదేశ్ మక్కపాటి, సంతోష్ కోరం , నరేంద్ర రేపాక , శ్రీకాంత్ యదా, సుబ్బారెడ్డి, కార్తీక్ చెరలో, శ్రీహరి దండు, రాణి మాత, చిత్రలేఖ, హేమ, శృతి, వాసవి, మాధురి, రాధికా , అమిత, సందీప్ , అశోక్, శశి, విజయ్, వినోద్ మరియు రాజేష్ పాల్గొన్నారు.