కొడాలి నాని, వంశీల ఆచూకీ చెప్తే బహుమానం.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

Image 1

వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఆచూకీ చెప్తే బహుమానం ఇస్తామని టీడీపీ నేత ప్రకటించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో అడ్రస్ లేకుండా పోయినా కొడాలి నాని, వల్లభనేని వంశీల ఆచూకీ చెప్తే రూ.1116 బహుమానంగా ఇస్తామని టీడీపీ నేత బుద్ధా వెంకన్న సెటైర్లు వేశారు. కొడాలి నాని, వంశీ ఆచూకీ తెలిసిన వాళ్లు.. పోలీసులకు తెలియజేసి, వారిని అప్పగిస్త తప్పకుండా బహుమానం అందిస్తామని అన్నారు. ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అంటే దేవాలయం లాంటిదన్న బుద్ధా వెంకన్న.. అసెంబ్లీకి వెళ్లని 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులుగా నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాల్సిన బాధ్యత వారిపై ఉందని.. కానీ వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి రాకుండా ప్రజలను అవమానిస్తున్నారని మండిపడ్డారు.

అసెంబ్లీకి రాకపోయినా కూడా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రతి నెలా.. లక్షా 75 వేల రూపాయల జీతం వారి ఎకౌంట్లోకి పడుతున్నాయని.. ప్రజల గురించి ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వెళ్లని వారు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్లని 11 మంది ఎమ్మె్ల్యేలను మేకలుగా భావిస్తున్నామని.. ప్రజాధనాన్ని శుభ్రంగా మేస్తున్నాయంటూ బుద్ధా వెంకన్న విమర్శించారు. నిండు సభలో అవమానించారనే కారణంతో చంద్రబాబు అప్పట్లో అసెంబ్లీకి రానని శపథం చేశారని.. మిగతా టీడీపీ సభ్యులంతా అసెంబ్లీకి వెళ్లి ప్రజాసమస్యలను లేవనెత్తిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్ జగన్‌కు ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని.. దానికి వైసీపీ ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి రానివ్వడం లేదని మండిపడ్డారు.

వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికైనా సభకు రావాలని.. లేదంటే ఇప్పటి వరకు తీసుకున్న జీతాలు వెనక్కి ఇచ్చి రాజీనామా చేయాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. మరోవైపు వైఎస్ జగన్ విధానాలు నచ్చకే ఆ పార్టీని వీడుతున్నారన్న బుద్ధా వెంకన్న.. వైసీపీ త్వరలో పూర్తిగా ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. చంద్రబాబు కుటుంబాన్ని అవమానించిన రోజే వైసీపీ పతనం ఖాయమని.. ఆ పార్టీ నేతలే చెప్పారన్న బుద్ధా వెంకన్న.. అధికారం ఉందని కొడాలి నాని విర్రవీగిన రోజే వైసీపీ పనైపోయిందన్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ కనిపించకుండా పోయారని.. వారి ఆచూకీ చెప్తే రూ.1116 బహుమానంగా ఇస్తామంటూ బుద్దా వెంకన్న సెటైర్లు పేల్చారు.

Related News