అమెరికా ఎన్నికల్లో భారతీయులు ఘన విజయం
అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పాటు హౌస్ ఆఫ్ రిప్రంజటేటివ్స్కు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. భారత సంతతికి చెందిన సుహాస్ సుబ్రహ్మణ్యం (Suhas Subramanyam) ప్రతినిధుల సభ ఎన్నికల్లో విజయం సాధించారు.ఆయన వర్జీనియా 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్ధి క్లాన్స్‌పై గెలుపొందారు. అలాగే, భారత సంతతికి చెందిన మరో నేత రాజా కృష్ణమూర్తి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో విజయం సాధించారు. ఇల్లినాయిస్ 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన డెమెక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు.- అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా.. ఫలితాలు వెలువడుతున్నాయి. ఆరంభంలో దూకుడు ప్రదర్శించిన డొనాల్డ్ ట్రంప్.. కమలా హ్యారిస్ కంటే 100 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు లీడ్‌లో ఉన్నారు. కానీ, క్రమంగా పుంజుకున్న డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి కమలా హ్యారిస్.. 200 మార్క్ దాటారు. దీంతో ఇరువురి మధ్య ప్రస్తుతం కేవలం 20 ఓట్ల తేడా మాత్రమే ఉంది. అయితే, స్వింగ్ స్టేట్స్లో ట్రంప్ ఆధిక్యంలో ఉండటంతో ఆయనకు గెలుపు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. 24 రాష్ట్రాల్లో గెలిచి.. మరో ఐదు రాష్ట్రాల్లో ఆధిక్యంలో ఉన్నారు ట్రంప్. కమలా 17 రాష్ట్రాల్లో గెలిచి.. మరో 6 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.- అధ్యక్ష ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు సమాంతరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 39 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇందులో డొనాల్డ్ ట్రంప్ 24, కమలా హ్యారిస్ 16 రాష్ట్రాట్లో ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం వెలువడిన ఫలితాల సరళిని చూస్తే ట్రంప్ తిరుగులేని విజయం సాధించే అవకాశం ఉంది. కానీ, ఇంకా ఓటింగ్ ప్రక్రియ సాగడంతో పరిస్థితి మారుతుందని భావిస్తున్నారు. ట్రంఫ్ 230, కమలా 210 ఎలక్టోరల్ ఓట్లు గెలుపొందారు. కీలక రాష్ట్రం నెవాడాలో ఇంకా ఓట్ల లెక్కింపు ప్రారంభం కాలేదు. అక్కడ మరికొద్ది సేపట్లో ఓట్లను లెక్కించనున్నారు. అయితే, ఇవి తేలడానికి రెండు రోజుల సమయం పడుతుంది.- కాలిఫోర్నియా రాష్ట్రంలో డెమొక్రాటిక్ అభ్యర్ధి కమలా హ్యారిస్ విజయం సాధించారు. అక్కడ మొత్తం 54 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా.. కమలా గెలుపుతో ఆ ఓట్లు డెమొక్రాట్లకు వచ్చాయి. ప్రస్తుతం 13 రాష్ట్రాల్లో విజయం సాధించిన కమలాకు.. 187 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ 24 రాష్ట్రాల్లో మొత్తం 230 ఓట్లు సాధించారు.- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా మారిన స్వింగ్ స్టేట్స్ జార్జియా, పెన్సిల్వేనియా, జార్జియా, విస్కాన్సిస్, ఆరిజోనా, నార్త్ కరోలినా, నెవాడో ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. ప్రస్తుతం ఆరిజోనా మినహా మిగతా ఆరు రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. పెన్సిల్వేనియాలో ట్రంప్ ముందు వెనుకబడినా.. తర్వాత పుంజుకుని ప్రస్తుతం లక్ష ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.- అధ్యక్ష ఎన్నికలతో పాటు అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల సభకు ఎన్నికల జరుగుతున్నాయ. ఈ ఎన్నికల్లో పలువురు భారతీయులు పోటీలో ఉన్నారు. వర్జీనియా టెన్త్ డిస్ట్రిక్ట్ నుంచి డెమొక్రాటిక్ పార్టీ నుంచి పోటీచేసిన భారతీయ అమెరికన్ సుహాస్ సుబ్రమణ్యం.. రిపబ్లికన్ అభ్యర్ధి క్లాన్స్‌పై ఆధిక్యంలో ఉన్నారు. ఈ స్థానం నుంచి ఆయన గెలుపు దాదాపు ఖాయంగా తెలుస్తోంది. ఆరిజోనాలో ట్రంప్, కమలా మధ్య హోరాహోరీ పోరు నెలకుంది. అక్కడ మొదట ట్రంప్ భారీ ఆధిక్యంలో ఉండగా.. క్రమంగా తగ్గి హ్యారిస్ స్వల్ప ఆధిక్యంలోకి వచ్చారు.