చిన్న వయసులోనే ఆడపిల్లలు ఎందుకు మెచ్యూర్ అవుతున్నారు.. కారణాలివే!

Image 1

అమ్మాయిలు రజస్వల (పెద్ద మనిషి) అవ్వడం సాధారణమైన విషయం. ఒకప్పుడు అమ్మాయిలు పద్నాలుగు నుంచి పదిహేను ఏళ్ళకి రజస్వల అయ్యేవారు. అయితే, ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. యూనివర్శిటీ ఆఫ్ సిన్సినాటి నిర్వహించిన అధ్యయనం ప్రకారం చాలా మంది అమ్మాయిలు 8 నుంచి 10 ఏళ్లకే రజస్వల అవుతున్నారు. భారత్‌లో 15 శాతం మంది ఆడపిల్లలు 8 ఏళ్లకే మెచ్యూర్ అవుతున్నారని అధ్యయనం వెల్లడించింది. ఒక్క మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ మార్పు కనబడుతుంది.

అయితే, ఈ మార్పు ఎంత మాత్రం మంచిది కాదు. చిన్నప్పుడే మెచ్యూర్ అవ్వడం వల్ల ఆడపిల్లలు చాలా బాధలు పడుతున్నారు. వారిని ఇది చాలా ఎమోషనల్‌గా ఇబ్బంది పెడుతుంది. అంతేకాకుండా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్, జీవక్రియకు సంబంధించిన కొన్ని వ్యాధులు వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు చిన్న వయసులోనే ఆడపిల్లలు మెచ్యూర్ ఎందుకు అవుతున్నారు.. ఇందుకు గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

  • అధిక బరువు..
  • చిన్న వయసులోనే ఊబకాయం లేదా అధిక బరువుతో బాధపడే ఆడపిల్లలు త్వరగా మెచ్యూర్ అవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉంటే త్వరగా రజస్వల అవుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలో అధిక కొవ్వు ఉండటం వల్ల ఈస్ట్రోజెన్ హార్మోన్, ఇన్సూలిన్ స్థాయిలు పెరుగుతాయి. వీటి కారణంగా ఆడపిల్లలు యంగ్ ఏజ్‌లోనే యుక్త వయస్సుకు వస్తున్నారని నిపుణులు వెల్లడించారు.

    • బీపీఏ
    • సాధారణంగా ప్లాస్టిక్ డబ్బాలు, వాటర్ బాటిల్స్‌లో బిస్‌ఫెనాల్ - ఏ (బీపీఏ) అనే రసాయన పదార్థం ఉంటుంది. ఇది జీవక్రియ, జీర్ణక్రియలకు అడ్డంకి కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో లోపల చేరి పలు సమస్యలకు కారణమవుతుంది. బీపీఏ కంటెంట్ ఎక్కువ తీసుకున్న బాలికలు త్వరగా రజస్వల అవుతున్నారు. అంటే ప్లాస్టిక్ డబ్బాల్లో ఫుడ్ ఎక్కువ తినడం, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌లో నీరు తాగే అమ్మాయిలు త్వరగా మెచ్యూర్ అవుతున్నారు. అందుకే తల్లిదండ్రులు ఇలాంటి వాటికి దూరంగా పెట్టండి.

      • జీన్స్..
      • అమ్మాయిలు చిన్న వయసులోనే మెచ్యూర్ అవ్వడానికి జీన్స్(జన్యువులు) కూడా ఒక కారణమంటున్నారు. అమ్మాయి తల్లి, మేనత్త లేదా కుటుంబంలోని ముందు తరం వారు తక్కువ వయసులోనే మెచ్యూర్ అయితే ఈ సమస్య వస్తుందని నిపుణులు తెలిపారు.

        • హార్మోన్ల అసమతుల్యత..
        • చిన్న వయసులోనే రజస్వల అవ్వడానికి ప్రధాన కారణం హార్మోన్లలో మార్పు కూడా ఒక కారణమంటున్నారు నిపుణులు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్లు పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఈ హార్మోన్లు సాధారణంగా 9 నుంచి 14 సంవత్సారాల్లో పెరిగి.. రజస్వల అవ్వడానికి కారణమవుతాయి. అయితే, కొందరు అమ్మాయిల్లో ఈ హార్మోన్లు చిన్న వయసులోనే పెరుగుతున్నాయి. దీంతో.. వాళ్లు త్వరగా మెచ్యూర్ అవుతున్నారని నిపుణులు వెల్లడించారు.

          • తినే ఆహారపు అలవాట్లు..
          • మారిన జీవన శైలి, తినే ఆహారపు అలవాట్ల కారణంగా కూడా బాలికలు త్వరగా యుక్తవయసుకు వస్తున్నారని తెలిపారు నిపుణులు. చాలా మంది వ్యాయామం, శారీరక శ్రమ చేయడం లేదు. అంతేకాకుండా స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్, ఏది పడితే అది తింటున్నారు. ఎక్కువ యానిమల్ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఊబకాయం వంటి సమస్యలు వస్తున్నాయి. దీంతో పాటు ఆడపిల్లలు చిన్న వయసులోనే రజస్వల అవుతున్నారు.

            • ఒత్తిడి..
            • ఈ రోజుల్లో ఒత్తిడి చిన్న, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒత్తిడి వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీర్ఘకాలిక మానసిక ఒత్తిడికి గురైతే.. హార్మోన్లు అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది చిన్న వయసులోనే పీరియడ్స్ ప్రారంభం అవ్వడానికి కారణమవుతుంది.

              • పోషకాహార లోపం..
              • చాలా మంది అమ్మాయిలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు చిన్న వయసులోనే మెచ్యూర్ అవుతున్నారు. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల విటమిన్ డి, ఐరన్ వంటి వంటి పోషకాహార లోపాలు వస్తాయి. ఈ పోషకాహార లోపం వల్ల చిన్న వయసులోనే పీరియడ్స్ వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

                Related News