మంచు వారి ఫ్యామిలీ ఫైట్‌లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. వారం పది రోజులుగా మంచు వారి కుటుంబ తగాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదులు చేయటం, దాడులు చేసుకోవటం, వాయిస్‌లు రిలీజ్ చేయటం.. అబ్బో చాలా పెద్ద కథే నడిచింది. అయితే.. పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారణకు పిలిచి మనోజ్‌కు, విష్ణును కాస్త గట్టిగానే మందలించటంతో పాటు మనోజ్‌ను బైండోవర్ చేయటంతో.. గొడవ కాస్త సద్దుమణిగిందనుకున్నాం. కానీ.. ఈరోజు మనోజ్ మళ్లీ ఫిర్యాదు చేయటం, అది కూడా సంచలన ఆరోపణలు చేస్తూ కంఫ్లైంట్ ఇవ్వటం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
శనివారం (డిసెంబర్ 14న) రోజు మోహన్ బాబు భార్య పుట్టిన రోజు సందర్భంగా.. జల్‌పల్లిలోని నివాసంలో రాత్రి సమయంలో మంచు మనోజ్ తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలో కరెంట్ పోయింది. జనరేటర్ ఆన్ చేసినా.. ఫలితం లేకపోయింది. దీంతో.. రాత్రంతా కరెంట్ లేదు. ఇదే విషయమై.. అసలు జనరేటర్ ఎందుకు పని చేయలేదని ఉదయం సమయంలో పరిశీలిస్తే.. జనరేటర్‌లో పంచదార పోసినట్టు గుర్తించారు. ఆ పంచదార విష్ణు, ఆయన స్నేహితులే పోసినట్టుగా అనుమానించిన మనోజ్.. విష్ణుతో గొడవకు దిగాడు. ఆ సమయంలో ఇరువురు కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ విషయమై మంచు మనోజ్ మరోసారి పహాడీషరీఫ్ పోలీసులను ఆశ్రయించారు.
గొడవకు సంబంధించి.. ఆధారాలతో సహా విష్ణుపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో మనోజ్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో తనతో పాటు కుటుంబసభ్యులను కరెంట్ పిక్షన్ చేసి చంపాలని కుట్ర చేసారని.. తనతో పాటు భార్య, పిల్లలు, తల్లిని చంపే ప్రయత్నం జరిగిందని మనోజ్ సంచలన ఆరోపణలు చేశారు. వారం రోజుల క్రితం కొంతమంది వ్యక్తులపై ఫిర్యాదు చేశానని.. వాళ్లే ఇప్పుడు తమ ఇంట్లోకి ప్రవేశించి.. కుట్ర చేశారని ఆరోపించారు. మనోజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారని తెలుస్తోంది. రెండు రోజులు సైలెంట్‌గా ఉండటంతో.. మంచు వారి ఫ్యామిలీ ఫైట్ సద్దుమనిగిందని అందరూ భావిస్తున్న సమయంలో మరోసారి మనోజ్ కంప్లైంట్ చేయటంతో.. మళ్లీ రచ్చ షురూ అయ్యింది.
మరోవైపు.. మంచు విష్ణు, మోహన్ బాబు.. మొన్నటి గొడవలో మైకుతో దాడి చేసిన జర్నలిస్ట్ రంజిత్‌ను పరామర్శించారు. చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి రంజిత్‌తో పాటు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఆవేశంలో దాడి చేశానని.. తనదే తప్పని క్షమించాలని మోహన్ బాబు కోరారు. ఉద్దేశ్యపూర్వకంగా చేయలేదని.. మోహన్ బాబు వివరించారు. అయితే.. తనతో పాటు మీడియా సోదరులందరికీ క్షమాపణ చెప్పాలని రంజిత్ కోరగా.. ఏమాత్రం ఆలోచించకుండా మీడియా మిత్రులందరికీ మోహన్ బాబు తెలిపారు